![]() |
![]() |

రీసెంట్ గా బిగ్ బాస్ లీక్స్ ఇస్తున్న ఆదిరెడ్డి మీద అఖిల్ సార్థక్ పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో ఆదిరెడ్డి లీక్స్ ఇవ్వను అంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి ఆదిరెడ్డి ఎం చెప్పాడంటే " అగ్నిపరీక్షలో రచ్చ రచ్చ. నేను ఆ విషయాలను లీక్ చేయాలనుకోవడం లేదు. ఎపిసోడ్ చూస్తేనే మజా వస్తుంది. బిగ్ బాస్ చూసినట్టే ఉంటుంది. గొడవలే గొడవలు ఉంటాయి. నేను నిర్ణయించుకున్నాను ఇక నుంచి బిగ్ బాస్ గురించి ఎలాంటి లీక్స్ ముందుగానే ఇవ్వబోను. ఇంపార్టెంట్ అనుకున్నవి చూస్తేనే బాగుంటుంది...చెప్పాలి అని ఏమీ లేదు. మీరు కచ్చితంగా చూడాల్సిందే.
నంబర్స్ దగ్గర నిలబడి డిస్కషన్ చేసుకునేది ఎవరు ఎం పొజిషన్ అనేది అయ్యింది. ఇక ఆలోచించుకోండి రచ్చ ఫైర్ ఎలా ఉంటుందో." అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్ గా అఖిల్ సార్థక్ ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. "బిగ్ బాస్ కి సంబంధించి ఇన్ని లీక్స్ ముందుగానే ఇచ్చి ఆడియన్స్ ని అవమానిస్తున్నావ్. ఆ సస్పెన్సుని వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు" అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఆదిరెడ్డి ఈ లీక్స్ విషయంలో వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది.
![]() |
![]() |